బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన

TEJA NEWS

బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన మున్నూరు కాపు సంఘం రాష్ట్ర మరియు జిల్లా నూతన కార్యవర్గ సభ్యులు…

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నూతన కార్యవర్గ సభ్యులు బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మున్నూరు కాపు సంఘం రాష్ట, జిల్లా స్థాయిలో ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు ఎమ్మెల్యే చేతులమీదుగా నియామక పత్రాన్ని అందజేశారు.

అనంతరం బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ…. మున్నూరు కాపు సంఘం అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన బోరుబావి సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి కుంట సిద్ధిరాములు, జంగిటి రవి, మీడియా సెక్రెటరీ – సాయిని శ్రీనివాస్, ఉపాధ్యక్షులు పందిరి యాదగిరి, రాష్ట్ర కార్యదర్శి అప్పాల శేఖర్, రాష్ట్ర కమిటీ మెంబర్ సీహెచ్. శ్రీనివాస్, ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనారాయణ, కమిటీ సభ్యులు నాగరాజు, గ్రామ ప్రెసిడెంట్ మంత్రి రఘు, గ్రామ కమిటీ సభ్యులు హనుమంతు జనార్ధన్, గ్రామ ప్రధాన కార్యదర్శి చర్మ శ్రీకాంత్, షాపూర్ ప్రధాన కార్యదర్శి బాలరాజు, సూరారం డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, నాయకులు చంద్రగిరి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top