కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజాభాందవులు మా నాయకులు, బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …._
125 – గాజులరామారం డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన జి.తిరుపతి రావు (70), 129 – సూరారం డివిజన్ షాపూర్ సంజయ్ గాంధీ నగర్ కు చెందిన సి.దేవి చరణ్ (18), 131 – కుత్బుల్లాపూర్ డివిజన్ జి.సంతోషి (38) అనారోగ్య సమస్యతో బాధపడుతున్న విషయాన్ని స్థానిక పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 7.00 లక్షల రూపాయల విలువ గల ఎల్ఓసి చెక్కును మంజూరు చేయించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు జి.తిరుపతి రావు (3.00 లక్షలు), సి.దేవి చరణ్ (2.00 లక్షలు), జి.సంతోషి (2.00 లక్షలు) రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఎల్వోసీ మంజూరు చేయించగా ఆయా డివిజన్లకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకుల చేతుల మీదుగా ముగ్గురు లబ్ధిదారులకు ఎల్ఓసి చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పేద ప్రజల బాంధవులు మా నాయకులు బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ అని అన్నారు. అనారోగ్య సమస్యతో బాధపడుతూ మెరుగైన చికిత్సకై ఎదురుచూస్తున్న ప్రతి ఒక్క నిరుపేద లబ్ధిదారుడు ఈ ఎల్ఓసి సదుపాయాన్ని వినియోగించుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ కె.ఎం.గౌరీష్, పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకులు నార్లకంటి శ్యామ్, లక్ష్మణ్, కుంట వేణు, విజయ్ హరీష్ , శివా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
