లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి గారు ||
(కుత్బుల్లాపూర్ నియోజకవర్గం) నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ పరిధిలోని పలువురు పేదలకు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ చికిత్సకు సరిపడా స్థోమత లేక కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ని సంప్రదించగా వెంటనే స్పందించి రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ద్వారా శస్త్ర చికిత్స నిమిత్తం రూ. 60,000/- , ల ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ని మంజూరు చేయించి . కావున ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 129 డివిజన్ సూరారం వాసులు కె . సయమ్మా 60,000/ రూ -, తొండం పోచమ్మ – రూ 30,000/-, 130 డివిజన్ సుభాష్ నగర్ వాసులు ఎర్రవెల్లి సంజీవ్ రెడ్డి- రూ 60,000/-, సోమన్నగారి సాకేత్ రెడ్డి – రూ 29,000/-, కొంపల్లి మున్సిపాలిటీ వంకాయల కోమల దేవి -రూ 25,000/-, 128 డివిజన్ వల్లభాయ్ పటేల్ నగర్ -రూ 60,000/- – CMRF-మంజూరి పత్రాలను (చెక్కులు) అందజేశారు. అనంతరం హన్మంతన్న మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ద్వారా ఎంతో మేలు చేకూరుతుందని అలాగే అనారోగ్యం బారిన పడిన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని,పేద ప్రజల సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు అవిజె జేమ్స్, మాజీ కార్పొరేటర్ పల కృష్ణ, సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు బేకు శ్రీనివాస్, పండరి రావు, సంతోష్ ముదిరాజ్, ఎండి లాయక్, ఎండి అంజాద్, సయ్యద్ షఫీ, సురేందర్ రెడ్డి, ఎండి గఫ్ఫార్, అజయ్, తులసి రెడ్డి మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
