గృహాల్లో నివాసం లేకుంటే… ప్రభుత్వ సంకల్పం ఎలా నెరవేరుతుంది? : ప్రత్తిపాటి

TEJA NEWS

గృహాల్లో నివాసం లేకుంటే… ప్రభుత్వ సంకల్పం ఎలా నెరవేరుతుంది? : ప్రత్తిపాటి

  • ఇళ్లులేనివారు బాధపడుతుంటే… ప్రభుత్వమిచ్చిన ఇళ్లలో ఉండటానికి టిడ్కో లబ్ధిదారులకు ఇబ్బందేమిటి? : ప్రత్తిపాటి.
  • రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టిడ్కో గృహాల సద్వినియోగ సమస్యపై ముఖ్యమంత్రితో మాట్లాడతాను :ప్రత్తిపాటి.
  • మెప్మా…డ్వాక్రా మహిళల్ని బెదిరించి అవినీతికి పాల్పడిన గొప్ప చరిత్ర గత పాలకులది : ప్రత్తిపాటి.

టిడ్కో గృహాల లబ్ధిదారులు వాటిలో ఎందుకు నివాసముండటం లేదని, పట్టణ పరిధిలోని పేదలకోసం గతంలో టీడీపీప్రభుత్వం 4,512 ఇళ్లు నిర్మించి మౌలికవసతులు కల్పించినా, ఇప్పటికీ 3,300 గృహాలు ఖాళీగా ఉండటం ఏమిటని ఎమ్మెల్యే ప్రత్తిపాటి అధికారుల్ని ప్రశ్నించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో గురువారం ఆయన సంబంధిత అధికారు లతో టిడ్కో గృహాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

టిడ్కో గృహాల సద్వినియోగంపై ముఖ్యమంత్రితో చర్చిస్తాను…

లక్షలు వెచ్చించి నిర్మించిన ఇళ్లలో ఉండటానికి గతంలో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నవారంతా ఎందుకు నివాసం ఉండటంలేదో వారినే అడిగి తెలుసుకోవాలని, వారు నివాసానికి విముఖంగా ఉంటే ఆ ఇళ్లను ఇతరులకు కేటాయించాలని ప్రత్తిపాటి అధికారుల్ని ఆదేశించారు. ఇళ్లలో నివాసం ఉండకపోతే… అవి పాడైపోవడంతో పాటు.. ప్రభుత్వ సంకల్పానికి చెడ్డపేరు వస్తుందని ప్రత్తిపాటి తెలిపారు. కూటమిప్రభుత్వం వచ్చినప్పటినుంచీ లబ్ధిదారులు గృహాల్లో నివాసముండేలా అన్నిచర్యలు తీసుకుందన్నారు. రోడ్లు..వీధిదీపాల ఏర్పాటుతో పాటు మౌలిక వసతులు కల్పించినా ఇళ్లు నిరుపపయోగంగా ఉంటే ఎలాగని ప్రత్తిపాటి ప్రశ్నించారు. ఇళ్లు పొందిన వారు వాటిలో నివాసం లేకపోతే ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అయినట్టేనని, మరోపక్క మరలా ఇళ్లు కావాలనే దరఖాస్తులు ప్రజల నుంచి వస్తుంటాయని ప్రత్తిపాటి తెలిపారు. ఇళ్లు నిరుపయోగంగా ఉండటమనేది కేవలం చిలకలూరిపేటకే పరిమితం కాలేదని, రాష్ట్రవ్యాప్తంగా ఈ సమస్య ఉందని ఆయన చెప్పారు. టిడ్కోగృహాల సద్వినియోగంపై ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులతో సమస్య పరిష్కారంపై చర్చిస్తానని ప్రత్తిపాటి స్పష్టంచేశారు.

మెప్మా.. డ్వాక్రా మహిళల్ని బెదిరించి డబ్బులు కాజేసిన అవినీతి చరిత్ర గత పాలకులది..

టిడ్కో గృహాలపై అధికారులతో సమీక్ష అనంతరం ప్రత్తిపాటి మెప్మాసిబ్బందికి ట్యాబ్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మెప్మా సిబ్బందిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆర్పీలు సమర్థవంతంగా పనిచేసి కూటమిప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని ప్రత్తిపాటి సూచించారు. గత ప్రభుత్వం.. ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన అవినీతి మంత్రి మెప్మా సిబ్బందిని, డ్వాక్రా మహిళల్ని కూడా దోచుకున్నారని ప్రత్తిపాటి తెలిపారు. విధుల్లో కొనసాగడానికి కాలపరిమితి ఉన్నాకూడా కావాలని సదరు అవినీతి మంత్రి గ్రూపు సభ్యుల్ని భయపెట్టి, వారినుంచి అన్యాయంగా రూ.1000 నుంచి రూ.6,000 వరకు వసూలు చేశారని ప్రత్తిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెన్యువల్స్ ముసుగులో మెప్మా సిబ్బందిని, డ్వాక్రా మహిళల్నిప్రలోభపెట్టి.. వారి నుంచి అందినకాడికి అడ్డగోలుగా దోచేసి, అవినీతికి పాల్పడిన చరిత్ర గతపాలకులకే దక్కిందన్నారు.
సమావేశంలో టిడ్కో సిఓ, మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి బాబు, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, గోల్డ్ శ్రీను, నాయకులు షేక్ టీడీపీ కరీముల్లా, పఠాన్ సమాధ్ ఖాన్, మద్దుమలా రవి, సిఐ రమేష్, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top