కృష్ణాజిల్లా పోలీస్
రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యంగా, ట్రాఫిక్ నియంత్రణకు 16 నూతన ద్విచక్ర వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన ఏలూరు రేంజ్ IGP శ్రీ జి.వి.జి అశోక్ కుమార్, ఐపీఎస్.,
హెల్మెట్ ను భారంగా కాకుండా బాధ్యతగా ధరించి ప్రాణ రక్షణ పొందండి.
కృష్ణాజిల్లా పోలీస్ శాఖ CSR FUND ద్వారా 3 నూతన బొలెరో వాహనాలను బహుకరించిన లిఖిత ఇన్ఫాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.
పోలీస్ శాఖ యొక్క పనితీరును మరింత మెరుగుపరుచుకోవడానికి నూతన వాహనాలు అందించిన లిఖిత ఇన్ఫ్రా వారికి కృష్ణా జిల్లా పోలీస్ శాఖ తరపున ధన్యవాదాలు తెలియజేసిన జిల్లా ఎస్పీ
నేడు వేగంగా పెరుగుతున్న ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడానికి ,రహదారి ప్రమాదాలను గణనీయంగా తగ్గించే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు పోలీస్ శాఖకు ట్రాఫిక్ నియంత్రణ కోసం అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ద్విచక్ర వాహనాలను బహుకరించగా అందులో కృష్ణా జిల్లా పోలీస్ శాఖకు కేటాయించబడిన 16 నూతన ద్విచక్ర వాహనాలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఏలూరు రేంజ్ ఐజిపి శ్రీ జి.వి.జి అశోక్ కుమార్, ఐపీఎస్., , జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు, ఐపీఎస్ తో కలిసి జండా ఊపి ప్రారంభించారు.
అలాగే కృష్ణా జిల్లా పోలీస్ శాఖకు వాహనాల అవసరతను గుర్తించి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) ద్వారా లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు 3 నూతన బొలెరో వాహనాలను అందించగా వాటిని దాతలైన జీ.వి రావు , ఇతర దాతలతో కలిసి IGP గారు, SP జండా ఊపి ప్రారంభించారు.
▪️రాష్ట్ర డిజిపి కార్యాలయం, మంగళగిరి నుండి వచ్చిన వాటిలో టీవీఎస్ అపాచీ ఆర్ టి ఆర్ 160 సీసీ ద్విచక్ర వాహనాలు 15, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఒకటి, ఈ వాహనాలకు సైరన్, బ్లింకర్స్, పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టం, ప్రధమ చికిత్స కిట్, క్రౌడ్ కంట్రోల్ చేయడానికి అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించారన్నారు.
IGP మాట్లాడుతూ..
▪️మారుతున్న కాలానికి అనుగుణంగా అదునాతన సాంకేతికతో కూడిన వాహనాలు పోలీస్ శాఖకు ఎంతో అవసరమని, రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ కి కేటాయించిన ఈ వాహనాల ద్వారా ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడమే కాక సుదూర ప్రాంతాలను సైతం సులభంగా చేరుకునే వీలు ఈ ద్వి చక్ర వాహనాల ద్వారా ఉంటుందని తెలిపారు.
▪️ట్రాఫిక్ రెగ్యులేషన్ విధులు సమర్థవంతంగా నిర్వహించేందుకు, ట్రాఫిక్ అవాంతరాలు ఏర్పడుతున్న ప్రదేశాలలో వీటి ద్వారా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడటం వీలవుతుందన్నారు.
▪️ఈ ద్విచక్ర వాహనాలు ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులకు మరింత వేగవంతంగా స్పందించే అవకాశాన్ని కల్పిస్తాయి. ప్రజలకు మెరుగైన సేవలందించడంలో ఇవి ఉపయోగపడతాయని తెలిపారు.
SP మాట్లాడుతూ..
▪️ట్రాఫిక్ నియంత్రణ, రోడ్ సేఫ్టీ, మరియు ప్రజలకు వేగవంతమైన సేవలందించడానికి ఈ ద్విచక్ర వాహనాలు ఎక్కడైనా త్వరగా చేరుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండటంతో, ప్రమాద సంఘటనల సమయంలో తక్షణ చర్యలు తీసుకోవడం, ట్రాఫిక్ జాం సమస్యలు పరిష్కరించడం వంటి అంశాల్లో ఈ వాహనాలు ఎంతోగానో ఉపయోగపడతాయన్నారు.
▪️ విజిబుల్ పోలీసింగ్ పెరగడంతో ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారని, ఎక్కడైనా ఫోర్ వీలర్ వెళ్ళలేని ప్రాంతాలలో టూ వీలర్స్ వెళ్ళి అక్కడ ట్రాఫిక్ సమస్యను తగ్గించి, ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో పని చేస్తాయన్నారు.
▪️నూతన ద్విచక్ర వాహనాలు ట్రాఫిక్ క్రమబద్ధీకరించే పోలీస్ సిబ్బందికి వారి విధులు మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయన్నారు.
▪️ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలన్నారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపుతూ ఎక్కువ మంది తలకు గాయం కావడం వల్లే చనిపోతున్నారని, వాటి వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, హెల్మెట్ ధారణతో ప్రమాదాల నుండి రక్షణ పొందవచ్చని, తలకు గాయాలు కాకుండా హెల్మెట్ రక్షణ కల్పిస్తుందన్నారు.
▪️ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల నుండి తమను తాము కాపాడుకోవాలని సూచించారు.
పోలీస్ శాఖలో ఉన్న అవసరతలను గుర్తించి ఇలా దాతలు ముందుకు వచ్చి చేసిన సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఈ వాహనాలన్నిటిని అవనిగడ్డ సబ్ డివిజన్ లోని పోలీస్ స్టేషన్లకు కేటాయించడం జరుగుతుందని, ఈ వాహనాలకు పోలీస్ శాఖ వెచ్చించే ఆదాయాన్ని పోలీస్ సిబ్బంది యొక్క సంక్షేమానికి వినియోగించుకునే వీలు కలుగుతుందని, వాహనాలను అందజేసిన లిఖిత ఇన్ఫ్రా వారికి కృష్ణా జిల్లా పోలీస్ శాఖ తరపున ప్రత్యేక ధన్యవాదాలు ఎస్పీ తెలిపారు.
అనంతరం దాతలైన జీ.వి రావు కి ఐ.జి.పి , ఎస్పీ సత్కరించి అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి అడ్మిన్ వి.వి నాయుడు , అడిషనల్ ఎస్పీ AR బి.సత్యనారాయణ , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు , చిలకలపూడి ఇన్స్పెక్టర్ అబ్దుల్ నబీ , రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సతీష్ కుమార్ , రవికుమార్ , రవి కిరణ్ , రాఘవయ్య , ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
