స్విమ్స్ కార్మికులకు జీతాలు పెంచాలి

TEJA NEWS

స్విమ్స్ కార్మికులకు జీతాలు పెంచాలి

** రెండోరోజు రిలే నిరాహార దీక్షల్లో సీఐటీయూ నేతలు

తిరుపతి: తిరుపతిలో టీటీడీకి చెందిన స్విమ్స్ ఆస్పత్రిలో పనిచేస్తున్న వందలాది కార్మిక సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ మహిళా నేతలు డిమాండ్ చేశారు. గత రెండున్నర మాసాలుగా ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోక పోవడంతో ఈనెల 4వ తేదీ డైరెక్టర్ కు, టీటీడీ అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగిందని, మూడుసార్లు లేబర్ అధికారులతో చర్చలు జరిగినా సమస్య పరిష్కారం కాకపోవడంతో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగిందని కార్మిక నాయకులు తెలిపారు. రిలే నిరాహార దీక్షల్లో రెండోరోజు శుక్రవారం స్విమ్స్ లో పనిచేస్తున్న మహిళలు జయమ్మ, ఎల్.సరస్వతి, కే.అరుణ, గౌరీ, ఎస్.సుజాత, బృంద, సుభాషిని, ఉష, నాగభూషణమ్మ పాల్గొన్నారు. వీరికి సిఐటియు నేతలు ఆర్ లక్ష్మి, పి బుజ్జి పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీనియర్ జర్నలిస్టు రాఘవ శర్మ మాట్లాడుతూ స్విమ్స్ యాజమాన్యం కార్మికుల పట్ల అనుసరిస్తున్న మొండి వైఖరి మార్చుకోవాలని, కార్మికులు ఆవేదన చెందుతున్నా యాజమాన్యం పట్టించుకోకుండా మొండిగా వ్యవహరించడం సరైన విధానం కాదన్నారు.
దళితులు, బలహీన వర్గాల మహిళలు పెద్ద సంఖ్యలో కార్మికులుగా ఉండడం పట్ల తీవ్ర వివక్షతను ప్రదర్శిస్తూ మనుషులుగా కూడా చూడకపోవడం దారుణమని అన్నారు.
ఏడాది కిందట స్వయంగా డైరెక్టర్ సమక్షంలో చర్చలు జరిపి రాతపూర్వకంగా ఒప్పందాలు చేసుకున్నా వారు ఇచ్చిన హామీని కూడా అమలు చేయకపోవడం సరైన విధానం కాదన్నారు.
రాతపూర్వకంగా ఇచ్చిన ఒప్పందాలు కూడా అమలు చేయకపోవడం వల్లనే కార్మికులు ఆందోళన బాటలో ఉన్నారని విజ్ఞులైన ప్రజలు, ఉన్నతాధికారులు గుర్తించి ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.


సమస్యల పరిష్కారానికి ఈనెల 18 నుంచే సమ్మెలోకి కార్మికు వెళ్లాల్సి ఉండగా ఆసుపత్రి అత్యవసర విభాగం రోగులకు ఇబ్బంది కలుగుతుందన్న కారణంతో సిఐటియు నాయకులు లేబర్ అధికారుల సూచన మేరకు సమ్మెను వాయిదా వేయడం జరిగిందని తెలిపారు. ఏడాది కాలంగా మాటలు చెబుతూ నమ్మించి మోసం చేస్తున్న యాజమాన్యం ఇప్పటికైనా స్పందించాలని, లేనిపక్షంలో తిరుపతిలో ఉన్నటువంటి పౌర సమాజం, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పోరాడుతున్న కార్మికులకు అండగా నిలబడి ఈ ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్విమ్స్ కార్మికుల వర్కింగ్ ప్రెసిడెంట్ కే.వేణుగోపాల్, హాకర్స్ నగర కార్యదర్శి బుజ్జి, సిఐటియు నగర ఉపాధ్యక్షులు పి.చిన్న, స్విమ్స్ కార్మికులు జి.రవి, వి.సూరిబాబు, మారిముత్తు, బాషా, గోపి, వేలు కోటయ్య, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top