మహా న్యూస్ కార్యాలయంపై దాడి అమానుష చర్య…

TEJA NEWS

మహా న్యూస్ కార్యాలయంపై దాడి అమానుష చర్య…

దాడిని తీవ్రంగా ఖండించిన కల్వకుర్తి జర్నలిస్టులు,ప్రజా సంఘాల నాయకులు…

హైదరాబాద్ నగరంలోని మహా టీవీ ఛానల్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి జర్నలిస్టులు ప్రజాసంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా జర్నలిస్టులు ప్రజాసంఘాల నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి కల్వకుర్తి పట్టణంలోని బస్టాండ్ నుంచి మహబూబ్ నగర్ చౌరస్తాలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జర్నలిస్టులు ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా వ్యవహరించే మీడియాపై జరిగిన దాడిని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా పరిగణించారు.మహా న్యూస్ టీవీ ఛానల్ పై దాడి చేసిన బిఆర్ఎస్ పార్టీకి చెందిన గుండాలను తక్షణమే అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కథనాలు,ప్రసారాల పట్ల అభ్యంతరాలు ఉంటే ఛానల్ యాజమాన్యాలకు వివరణ కోరాలే తప్ప ఇలాంటి దాడులు చేయడం సమంజసం కాదని హెచ్చరించారు.మహా టీవీ ఛానల్ యాజమాన్యానికి కల్వకుర్తి జర్నలిస్టులతో ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top