భారీ వరదలు.. కరిగిపోయిన రూ.50 కోట్ల విలువైన పంచదార
హరియాణాలో రాత్రి కురిసిన భారీ వర్షాలకు యమునానగర్ ఉన్న ఆసియాలోనే అతిపెద్ద సరస్వతి షుగర్ మిల్‌లోకి నీరు ప్రవేశించింది. ఫలితంగా సుమారు రూ.50 నుండి రూ.60 కోట్ల విలువైన పంచదార కరిగిపోయిందని అధికారులు తెలిపారు. మొత్తం నిల్వలో సుమారు 40 శాతం నష్టం వాటిల్లింది. గోదాంలో రూ.97 కోట్ల విలువైన 2.20 లక్షల క్వింటాళ్ల పంచదార ఉండగా, తుది నష్టం మొత్తం గోదాంను పరిశీలించిన తరువాతే తెలుస్తుందన్నారు.
