ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ పట్టాభిరామ్‌ తుదిశ్వాస విడిచారు.

TEJA NEWS

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ పట్టాభిరామ్‌ తుదిశ్వాస విడిచారు.

  • ఆయనకు గుండెపోటు రావడంతో కన్నుమూశారు.
  • మానసిక వైద్యుడిగానూ పట్టాభిరామ్‌ ప్రసిద్ధి చెందారు.
  • ఆయనకు భార్య జయ, కుమారుడు ప్రశాంత్‌ ఉన్నారు. అయితే,
  • బీవీ పట్టాభిరామ్‌ భార్య కూడా వ్యక్తిత్వ వికాస నిపుణురాలిగా పేరుంది.
  • ఖైరతాబాద్‌లోని స్వగృహంలో ఆయన పార్థివదేహాన్ని ఉంచారు.
  • బుధవారం నాడు ఉదయం 9 గంటల
  • నుంచి అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు.
  • అలాగే, మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.
  • తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ‘రావ్ సాహెబ్’ భావరాజు సత్యనారాయణ సంతానంలోని
  • 15 మందిలో బీవీ పట్టాభిరామ్‌ ఒకరు.
  • కాకినాడలో ఉన్నత విద్య చదువుతున్న రోజుల్లో ఎంబేర్‌ రావు అనే ఇంద్రజాలికుడి నుంచి
  • ఆ విద్యను నేర్చుకుని..
  • ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఆహార సంస్థలో ఉద్యోగం చేసే రోజుల్లోనూ సాధన చేసి..
  • 1970 దశకం నాటికి ఇండిపెండెంట్ గా రెండుమూడు గంటల పాటు ప్రేక్షకులను కట్టిపడేసేలా ఇంద్రజాలం ప్రదర్శించే స్థాయికి బీవీ పట్టాభిరామ్‌ ఎదిగారు.

You cannot copy content of this page

Scroll to Top