జులై 4న ఎల్బీ స్టేడియంలో నిర్వహించబోతున్న బహిరంగ సభకు మరియు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ లో భాగంగా అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హాజరవుతున్నారు.
టిపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు,జిల్లా ఇంఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశానుసారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మేడ్చల్ నియోజకవర్గంలోని బోడుప్పల్లో మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్,టిపిసిసి ఉపాధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ నివాసంలో వారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి ,జిల్లాకి నియమించబడ్డ ఇంఛార్జిలు టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు శశికళ యాదవ రెడ్డి ,మిథున్ రెడ్డి ,గజ్జల కాంతం హాజరై నియోజకవర్గంలోని బ్లాక్,మున్సిపల్,కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు,మాజీ మేయర్లకు,మాజీ మున్సిపల్ చైర్మన్లకు,సీనియర్ నాయకులకు దిశ నిర్దేశం చేసి సభను విజయవంతం చేయవలసిందిగా కోరారు.*
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి ,మాజీ మేయర్లు తోటకూర అజయ్ యాదవ్ ,అమర్ సింగ్ ,శాంతి కోటేష్ ,మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ ,మేడ్చల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొమ్మక్ అజయ్ ,మాజీ కార్పొరేటర్ సుమన్ నాయక్ ,నియోజకవర్గంలోని ఏ బ్లాక్ అధ్యక్షులు జీడిపల్లి వేణుగోపాల్ రెడ్డి ,బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ ,మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింహులు యాదవ్ ,జిల్లా రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి ,నియోజకవర్గంలోని
మున్సిపల్,కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్ ,మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ ,మామిడ్ల ముత్యాలు యాదవ్ ,తుంగతుర్తి రవి ,ముప్పా రామ రావు ,ముప్పు శ్రీనివాస్ రెడ్డి ,వేముల శ్రీనివాస్ రెడ్డి ,సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ,సీనియర్ నాయకులు దర్గా దయాకర్ రెడ్డి ,విగ్నేశ్వర్ రెడ్డి ,కుమార్ ,అనుబంధ సంఘాల అధ్యక్షులు,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
