మూడు రోజులుగా కురుస్తున్న వర్షం : కుప్పకూలిన ఇల్లు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట మండలంలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది.వర్షానికి తిరుమల కుంట ఎస్సీ కాలనీకి చెందిన మోటూరు బాబురావు,సావిత్రి దంపతుల గుడిసె కుప్ప కూలింది. ఒక్కసారిగా కుప్పకూలడంతో భయభ్రాంతులకు గురైన వారు హుటాహుటిన ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. రోజు కూలి పని చేసుకొని జీవనం సాగిస్తున్నామని, ఇల్లు కట్టుకునే పరిస్థితిలో లేమని వాపోయారు.ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని కోరుతున్నారు.
