కుప్పంలో సీఎం చంద్రబాబు కు ఘన స్వాగతం

TEJA NEWS

కుప్పంలో సీఎం చంద్రబాబు కు ఘన స్వాగతం

కుప్పం (తిరుపతి): రెండు రోజుల పర్యటన నిమిత్తం కుప్పానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శాంతి పురం మండలం, కడపల్లెలో చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు ఘనంగా సాదర స్వాగతం పలికారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సి.యం. చంద్రబాబు నాయుడుతో కలిసి ఎంపీ పాల్గొన్నారు.
నిత్య కృషీవలుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని , ఆయన సారధ్యంలో పని చేయడం చాలా ఆనందంగా ఉందని ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు అన్నారు.
రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి తీసుకొచ్చిన సంస్కరణలు ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుస్తాయని ఎంపీ అన్నారు. కుప్పాన్ని ప్రపంచ చిత్ర పటంలో నిలిపిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. ఆయన స్పూర్తితో తాను కూడా చిత్తూరు పార్లమెంటు సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు

You cannot copy content of this page

Scroll to Top