తన పోరాటంతో మన్యం వీరుడు ప్రజలహృదయాల్లో నిలిచారు : ప్రత్తిపాటి.

TEJA NEWS

తన పోరాటంతో మన్యం వీరుడు ప్రజలహృదయాల్లో నిలిచారు : ప్రత్తిపాటి.

  • పార్టీ శ్రేణులతో కలిసి అల్లూరికి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి

    మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకొని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు నివాళులు అర్పించారు. తన క్యాంప్ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి అల్లూరికి ఘన నివాళులు అర్పించిన ప్రత్తిపాటి.. ఆ వీరుడి ధైర్యసాహసాలను స్మరించుకున్నారు. మన్యం పులి అల్లూరి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడి.. దేశం కోసం ప్రాణత్యాగం చేసి శాశ్వతంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయాడని ప్రత్తిపాటి కొనియాడారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు నెల్లూరి సదాశివరావు, షేక్ టీడీపీ కరీముల్లా, పఠాన్ సమాధ్ ఖాన్, మద్దుమలా రవి, తోట బ్రాహ్మస్వాములు, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.

You cannot copy content of this page

Scroll to Top