14, 15 తేదీల్లో సిఫార్సు దర్శనాలు రద్దు
** 16న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 16న ఆణివార ఆస్థానం నేపథ్యంలో 14, 15 తేదిల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ అధికారులు తెలిపారు.
ఇందులో భాగంగానే 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుందని తెలిపారు.
రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశామన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సహకరించవలసినదిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేయడమైనది.
