ఇన్సూరెన్స్ స్కీములపై అవగాహన కార్యక్రమం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామ పంచాయితీ రైతు వేదిక వద్ద ITDA వారి సహకారంతో PMJJBY, PMSBY ఇన్సూరెన్స్ స్కీములపై అవగాహన కార్యక్రమంనిర్వహించారు.ఏదైనా కారణం చేత మరణించిన వ్యక్తుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందుతుందని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ పాలసీకి అర్హులని గ్రామంలో అందరూ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏపిఎం వెంకటేశ్వరరావు, సీసీ సత్యనారాయణ, గ్రామ సెక్రెటరీ కార్తిక్, బ్యాంకు మిత్ర వెంకటలక్ష్మిపాల్గొన్నారు.
