స్విమ్స్ లో “నిరంతర వైద్య విద్యా కార్యక్రమం”
తిరుపతి: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్)కు చెందిన మెడికల్ అంకాలజీ, సర్జికల్ అంకాలజీ, రేడియోధెరపీ, పాథాలజీ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నిరంతర వైద్య విద్యా కార్యక్రమం జరిగింది. మధ్యాహ్నం శ్రీ పద్మావతి ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్విమ్స్ మెడికల్ వర్సిటీ రిజిస్ట్రార్ డా.అపర్ణ ఆర్ బిట్లా, సర్జికల్ అంకాలజీ విభాగాధిపతి డా.మణిలాల్, మెడికల్ అంకాలజీ ఇంఛార్జ్ విభాగాధిపతి డా.భార్గవి, రేడియేషన్ అంకాలజీ విభాగాధిపతి డా. సుబ్రమణియన్, పాథాలజి విభాగాధిపతి డా.రుక్మాంగధ, ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డా. ప్రవీణ్, స్వీకార్ మెడికల్ డైరెక్టర్ డా. ప్రశాంత్ పాల్గొని జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాధాలజి విభాగం అసిస్టెంట్ ప్రొ.డా. శివకుమార్ మాట్లాడుతూ ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఇప్పుడు నాలుగు పరమాణు వర్గాలుగా ఏర్పడిందని, అల్ట్రామ్యూటెడ్, అసమతుల్యత మరమత్తు లోపం, అసాధారణం, నిర్దిష్ట మాలిక్యులర్ ప్రొఫైల్. ఈ వర్గీకరణ క్యాన్సర్ జీనోమ్ అట్లాస్ చే అభివృద్ధి చేయబడిందని తెలిపారు. ప్రొయాక్టివ్ మాలిక్యులర్ రిస్క్ క్లాసిఫైయర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంతర్గతంగా శుద్ధి చేయబడుతుందని, ఇది రోగ నిర్ధారణ మరియు చికిత్సా వ్యూహాలపై విలువైన సమాచారం అందిస్తుందని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తెలియజేశారు. స్వీకార్ మెడికల్ డైరెక్టర్ డా. ప్రశాంత్ మాట్లాడుతూ.. ఎండోమెట్రియల్ క్యాన్సర్ శస్త్ర చికిత్స నిర్వహణలో గర్భాశయ తొలగింపు, అండాశయాలు, ఫెలోపియన్ ట్యూబ్ తొలగింపు విభజన ఉంటుందని, ల్యాపరోస్కోపిక్ లేదా రోబోటిక్ సర్జరీల ద్వారా చాలా త్వరగా కోలుకోవడం జరుగుతుందని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తెలియజేశారు. రేడియేషన్ అంకాలజి విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.ఆర్.యామిని కుమార్ మాట్లాడుతూ.. రేడియోథెరపీ ద్వారా క్యాన్సర్ రోగులలో ఉండే ప్రమాదాన్ని తగ్గించడం కోసం, రేడియోథెరపీ చికిత్స ద్వారా క్యాన్సర్ రోగులకు ఉండే ప్రమాదాన్ని తగ్గిస్తుందని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తెలియజేశారు.
మెడికల్ అంకాలజి విభాగం అసిస్టెంట్ ప్రొఫెనర్ డా.వి. ఆదిత్య మాట్లాడుతూ… ఇమ్యునోథెరపీ అనేది ఎండోమెట్రియల్ క్యాన్సర్ కు అభివృద్ధి చెందుతున్న చికిత్స, ఇది క్యాన్సర్ కణాలతో పోరాడటానికి శరీరం యొక్క స్వంత రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తుందని. ఎండోమెట్రియల్ క్యాన్సర్లో ఇమ్యునోథెరపీ క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా రోగనిరోధక వ్యవస్థ యొక్క ప్రతిస్పందనను పెంచడం, కణితులను తగ్గించడం లేదా వాటి పెరుగుదలను మందగించడం వంటి లక్ష్యాలను ఉంటాయని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ వెంకటకోటిరెడ్డి, పీఆర్వో విభాగం డీడీ రాజశేఖర్, సిబ్బంది అమర్, గణేష్, సుబ్రహ్మణ్యం రెడ్డి, మెడికల్ అంకాలజీ, సర్జికల్ అంకాలజీ, రేడియోథెరపి విభాగపు వైద్యులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
