పేటలో కోర్టు భవన నిర్మాణానికి స్థల పరిశీలన:ప్రత్తిపాటి పుల్లారావు

TEJA NEWS

పేటలో కోర్టు భవన నిర్మాణానికి స్థల పరిశీలన:ప్రత్తిపాటి పుల్లారావు

చిలకలూరిపేట పట్టణంలో నూతన కోర్టు భవన నిర్మాణానికి అనువైన స్థలాల కోసం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలన జరిపారు. ప్రస్తుతం కోర్టు అద్దె భవనంలో కొనసాగుతున్న నేపథ్యంలో, సొంత భవనం నిర్మించుకోవడానికి ప్రభుత్వం నుంచి స్థలం కేటాయించాలని న్యాయవాదులు కోరుతున్నారు.ఈ మేరకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, కమిషనర్ శ్రీహరి, మరియు న్యాయవాదులతో కూడిన బృందం పట్టణంలోని పలు ప్రాంతాల్లో గల స్థలాలను పరిశీలించింది. ముఖ్యంగా, ఎన్‌ఆర్‌టీ రోడ్డులోని గంగమ్మా తల్లి దేవస్థానం సమీపంలో ఉన్న స్థలాన్ని వారు పరిశీలించారు. ప్రభుత్వం స్థలం కేటాయిస్తే కోర్టుకు సొంత భవనాన్ని నిర్మిస్తామని న్యాయవాదులు తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top