భట్టిప్రోలు(రైలుపేట) గ్రామము లో సుపరిపాలన లో తొలి అడుగు కార్యక్రమం లో పాల్గొన్న వేమూరు శాసన సభ్యులు నక్కా ఆనందబాబు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమము లో వేమూరు శాసన సభ్యులు నక్కా ఆనందబాబు పాల్గొన్నారు.
భట్టిప్రోలు(రైలుపేట) గ్రామము లోని ఇంటి ఇంటికి వెళ్లి ఏడాది కాలంలో గ్రామంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి పాంప్లెట్ రూపంలో అందజేసి అలాగే వారు ఎదుర్కొంటున్న సమస్యలను నోట్ చేసుకొని ఆ సమస్యలను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తానని తెలియజేశారు.
ఈ డోర్ టు డోర్ కార్యక్రమాన్ని మై టిడిపి ఆప్ ద్వారా అప్డేట్ చేశారు.
భట్టిప్రోలు(రైలుపేట) మండల తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పాల్గొన్నారు
ఈ సమావేశంలో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన ఇంటింటికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలు నాయకులు మీద ఉంది.
ప్రతిరోజు 25 నుంచి 30 గృహాలను సందర్శించి ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన పనులను అలాగేమీ గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులను వారికి తెలియజేసి, ఇంకా వారి సమస్యలు ఏమైనా ఉంటే వాటిని నోట్ చేసుకొని నా దృష్టికి తీసుకురావాలి.
మీరు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినప్పుడు వెంటనే అక్కడే మై టిడిపి ఆప్ లో ప్రోగ్రాంను అప్డేట్ చేయాలి.
అలాగే ఇంకా మిగిలిపోయి ఉన్నటువంటి అనుబంధ సంఘాల కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలి. బూత్ యూనిట్ క్లస్టర్ ఇంచార్జిలు కుటుంబ సాధికార సారథులను వెంటనే నియమించుకోవాలి.
ఈ కార్యక్రమంలో భట్టిప్రోలు(రైలుపేట) మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
