కొంపల్లి మున్సిపాలిటీ లో పలు కాలనీలో అభివృద్ధి లేక తీవ్ర ఇబ్బందులు

TEJA NEWS

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం లోని కొంపల్లి మున్సిపాలిటీ లో పలు కాలనీలో అభివృద్ధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న కాలనీలకు కొంపల్లి మాజీ సర్పంచ్ జిమ్మీ దేవేందర్ కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన కూన శ్రీశైలం గౌడ్ కొంపల్లి మాజీ సర్పంచ్ జిమ్మీ దేవేందర్ ను తీసుకొని అభివృద్ధి పనులకు 12 కోట్ల రూపాయల ప్రతిపాదనలు సి ఎం డి శ్రీదేవి ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనికి సానుకూలంగా సిఎండి స్పందిస్తూ త్వరలోనే ఈ నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా కొంపల్లి, దుండిగల్ మున్సిపాలిటీలలో, మరియు నిజాంపేట్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా పనిచేస్తున్నారని వీరిని కట్టడి చేయాలని సిఎండి ని కోరడం జరిగింది. ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు, కాలనీలో వాసులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top