తక్షణ సాయంతో కుత్బుల్లాపూర్ ప్రజల ఆరోగ్య రక్షకులుగా బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
126 – జగద్గిరిగుట్ట డివిజన్ దేవమ్మ బస్తీ కాలనీకి చెందిన మహదేవ్ నారాయణ తండ్రి మహదేవ్ పండరీనాథ్ (70) అనారోగ్య సమస్యతో బాధపడుతున్న విషయాన్ని డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 1.50 లక్షల రూపాయల విలువ గల ఎల్వోసీ చెక్కును మంజూరు చేయించగా ఈరోజు చింతల్ ఎమ్మెల్యే కార్యాలయంలో డివిజన్ కు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకుల చేతుల మీదుగా లబ్ధిదారుడి కుటుంబసభ్యులకు ఎల్ఓసి చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…తక్షణ సాయంతో కుత్బుల్లాపూర్ ప్రజల ఆరోగ్య రక్షకులుగా నిలిచిన నేత, కుత్బుల్లాపూర్ సంక్షేమ ప్రదాత బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ అని అన్నారు. ఆరోగ్యం బాగోలేక మెరుగైన చికిత్సకై ఎదురుచూస్తున్న ప్రతి ఒక్క నిరుపేద లబ్ధిదారుడు ఈ ఎల్ఓసి సదుపాయాన్ని వినియోగించుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జగన్, చింతల్ డివిజన్ అధ్యక్షులు మహమ్మద్ రఫీ, శ్రీవెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, పాపులు గౌడ్, సంపత్ రెడ్డి, జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
