పీజేఆర్ నగర్ లో పలు సమస్యలపై పాదయాత్ర చేసిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

TEJA NEWS

పీజేఆర్ నగర్ లో పలు సమస్యలపై పాదయాత్ర చేసిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

124 ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని పీజేఆర్ నగర్ లో సీసీ రోడ్ల నిర్మాణం చాలా కాలం నుండి పెండింగులో ఉందని కాలనీ వాసులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురావడం జరిగింది. కార్పొరేటర్ పీజేఆర్ నగర్ కాలనీ లో పర్యటించి కాలనీ వాసులతో కలిసి సీసీ రోడ్లను పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సీసీ రోడ్డు నిర్మాణం కొరకు ఇప్పటికే నిధులు మంజూరై ఉన్నాయి కాబట్టి వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది. సీసీ రోడ్డు నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. రోడ్డును మంచిగా లెవెలింగ్ చేసి వర్షపు నీరు నిలిచిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో నిర్మాణ పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జి.రవి, అగ్రవాసు, గోపాల్, రవీందర్, మహేష్, శివ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top