ఎ.కొండూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన పోలీస్ కమీషనర్ .ఎస్.వి.రాజశేఖరబాబు ఐ.పి.ఎస్

TEJA NEWS

ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయము, విజయవాడ.

ఎ.కొండూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన పోలీస్ కమీషనర్ శ్రీ.ఎస్.వి.రాజశేఖరబాబు ఐ.పి.ఎస్.

 ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజశేఖరబాబు ఐ.పి.ఎస్.    ఉదయం మైలవరం సబ్ డివిజన్ పరిదిలోని ఎ.కొండూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా పోలీసు స్టేషన్ ను తనిఖీ చేసి పోలీసు స్టేషన్ పరిసరాలలో ఏర్పాటు చేసిన సి.సి.కెమెరాల పనితీరును పరిశీలించారు, సురక్షా కమిటీ తో సమన్వయం చేసుకుంటూ పోలీసు స్టేషన్ పరిది లోని అన్నీ టెంపుల్స్, చర్చిలు, మసీదులు అన్నింటిలో సి.సి.కెమెరాలు ఏర్పాటు చేసి ఎక్కడా ఎటువంటి సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని తెలియజేశారు.

అదేవిధంగా పోలీసు స్టేషన్ కు కొత్తగా ఇచ్చిన కంప్యూటర్స్ ఏవిదంగా ఉపయోగిస్తున్నారనే విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సి.సి.టి.ఎన్.ఎస్., కేసు రికార్డు మెంటినెన్స్, కొత్తగా వచ్చిన ఏ.ఐ.టూల్స్ లను ఏవిధంగా ఉపయోగిస్తున్నారు అనే విషయాలను అడిగి తెలుసుకుని పలు సూచనలు సలహాలు అంధించారు.

అన్నీ రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, న్యూ క్రిమినల్ లా-2023 చట్టాలను అంధరూ తెలుసుకోవాలని, ఇంపార్టెంట్ టు ఇన్వెస్టిగేషన్ ఎఫ్.ఐ.ఆర్. టు చార్జ్ షీట్ వరకు ఆదునిక సాంకేతిక పరిజ్నానాన్ని ఉపయోగించుకుని సాక్ష్యాధారాలు సేకరించి ఖచ్చితంగా నేరస్తులకు శిక్ష పడేవిధంగా చర్యలు తీసుకోవాలని, ప్రతి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవాలని, నేషనల్ హైవే పై రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన రోడ్డు భద్రత చర్యలు చేపట్టాలని, వివిధ రకాల సమాచారంతో కూడిన సైన్ బోర్డు లను ఏర్పాటు చేయాలని ప్రమాదాలు తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని, పెండింగ్ లో ఉన్న కేసులను త్వరితగతిన విచారించి చార్జ్ షీట్స్ ఫైల్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్ తోపాటు మైలవరం ఏ.సి.పి. వై.ప్రసాద రావు , ఎస్.బి. ఇన్స్పెక్టర్ డి.వి.రమణ , ఏ. కొండూరు ఎస్.ఐ. కృష్ణ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top