కాంగ్రెస్ నాయకులపై దాడి దుర్మార్గం

TEJA NEWS

కాంగ్రెస్ నాయకులపై దాడి దుర్మార్గం

** కాంగ్రెస్ చంద్రగిరి ఇన్చార్జ్ లోకేష్ రెడ్డి

చంద్రగిరి: పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ మొదలయిందో లేదో కూటమి ప్రభుత్వం తన ప్రతాపాన్ని చూపిస్తోంది… ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గంలో నామినేషన్లు వేయడానికి వెళుతున్న కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు పోటుగారి భాస్కర్, పలమనేరు ఇన్చార్జ్ శివశంకర్, కుప్పం నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల గోపీ దంపతులపై దాడి అనైతిక చర్య అని కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి ఇన్చార్జ్ ఐరాల లోకేష్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం లో ప్రజలకు, పార్టీలకు ఎన్నికలలో పాల్గొనే హక్కు, స్వాతంత్య్రం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయంలో పక్షపాతంగా వ్యవహరించకుండా ప్రజల తీర్పుకై అన్ని పార్టీలు పాల్గొనేలా చూడాలన్నారు. ఈ విషయంలో ఆయన జిల్లా కలెక్టర్కు, ఎస్పీలకు తగు ఆదేశాలిచ్చి ప్రజా పక్షంగా శాంతియుత వాతావరణంలో ఎన్నికలలో అందరూ పాల్గొనేలా చూడాలని కోరారు. అలాగే కుప్పం నియోజకవర్గంలో జరిగిన దాడిని ఖండిస్తూ దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఐరాల లోకేష్ రెడ్డి డిమాండ్ చేశారు.

You cannot copy content of this page

Scroll to Top