చంద్రబాబు గట్టిగా దృష్టిపెడితే వైసీపీ అడ్రస్సే ఉండదు

TEJA NEWS

చంద్రబాబు గట్టిగా దృష్టిపెడితే వైసీపీ అడ్రస్సే ఉండదు. ఇంతకుముందున్న చంద్రబాబు కాదని వైసీపీ వారు గ్రహించాలి. ప్రజల్ని ఇబ్బంది పెడతాం… రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటామంటే చూస్తూ ఊరుకోవాలా?. జగన్ హాయాంలో రాష్ట్రంలో పరిశ్రమలు లేవు..యువతకు ఉద్యోగాలు లేవు. వైసీపీ అభిమానులు కూడా తమ బిడ్డల భవిష్యత్ కోసం చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచాలి. గత పాలకులు చేతగాని నిర్ణయాలతో గ్రామాలను అభివృద్ధికి దూరంచేశారు, అలాంటి వారిని ఊళ్లలోకి రాకుండా ప్రజలు తరిమికొట్టాలి, సిగ్గులేకుండా ఇంకా ప్రజల ముందుకు వచ్చి తామేదో చేసినట్టు బూటకపు మాటలు మాట్లాడుతున్నారు.

చిలకలూరిపేట మండలం గణపవరం, కొమరవల్లిపాడు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంస్థ సొసైటీల నూతన ఛైర్మన్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నాను. గణపవరం సొసైటీ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన పెంట్యాల శేషయ్యను, కొమరవల్లిపాడు సొసైటీ ఛైర్మన్ కోడె హనుమంతురావులను మరియు డైరెక్టర్లులను ప్రత్యేకంగా అభినందించి సన్మానించాటం జరిగింది.

You cannot copy content of this page

Scroll to Top