ప్రతినిత్యం ప్రజా శ్రేయస్సు కోసం పనిచెయ్యడమే నా లక్ష్యం — కూన శ్రీశైలం గౌడ్

TEJA NEWS

ప్రతినిత్యం ప్రజా శ్రేయస్సు కోసం పనిచెయ్యడమే నా లక్ష్యం — కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ తన నివాసం వద్ద రోజువారి కార్యాచరణలో భాగంగా నియోజకవర్గం నుండి వివిధ సమస్యల పరిష్కారానికి వచ్చిన ప్రజలతో కలిసి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్నారు..

అనంతరం నాయకులు,ప్రజల నుండి వచ్చిన ఆహ్వానాలు,వినతిపత్రాలు స్వీకరించి సానుకూలంగా స్పందించారు.

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ..

— నియోజకవర్గంలోని ఉన్న డివిజన్స్, మున్సిపాలిటీలో పెండింగ్ లో ఉన్న పనులు మరియు నూతన పనుల మంజూరు కొరకు ఇంచార్జి మంత్రి దృష్టికి తీసుకెళ్ళి వెంటనే స్పందించి నియోజకవర్గం అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని తెలిపారు..

— ప్రభుత్వ సంక్షేమా పథకాలను అందరు సద్వినియోగపర్చుకోవాలని కోరారు..

— కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో జిల్లా మెడికల్ అధికారులు ఆకస్మిక తనిఖీల వాళ్ళ RMP, PMP డాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారన్న విషయం తెలుసుకొని సంబంధిత జిల్లా మెడికల్ అధికారులతో మాట్లాడి వాళ్ళ సమస్యను పరిష్కరించాలని కోరడం జరిగింది..

ఈ కార్యక్రమం నియోజకవర్గం ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు తదితరులు పాల్గొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top