మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి

TEJA NEWS

మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ *

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో *మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ * తన నివాసం వద్ద నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు..

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ..

యువత భవిష్యత్తే దేశ భవిష్యత్తు అని సాంకేతిక, విద్య, వైద్య రంగాలలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని తెలిపారు..

అణగారిన బతుకుల్లో నింపి, ఆఖరి క్షణం వరకు దేశం కోసమే బతికిన ఆధునిక భారత నిర్మాత రాజీవ్ గాంధీ అని కొనియాడారు..

ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు తదితరులు పాల్గోన్నారు…

You cannot copy content of this page

Scroll to Top