తర్వాత ఎలాంటి బిల్డింగ్ పర్మిషన్స్ ఇవ్వరు

TEJA NEWS

: తర్వాత ఎలాంటి బిల్డింగ్ పర్మిషన్స్ ఇవ్వరు

అనధికారలేఅవుట్లను క్రమబద్ధీకరణ చేసుకోండి

కమిషనర్ పి శ్రీహరి బాబు

చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరి బాబు మీడియాతో మాట్లాడుతూ అనధికారలేఅవుట్లనుక్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. దీనిని లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) అంటారని, దీనికి సంబంధించిన జీవో ఎంఎస్ నెంబర్ 134, తేదీ 26/07/2025న జారీ అయిందని ఆయన వివరించారు.

పథకం యొక్క ముఖ్యాంశాలు

  • 26/07/2025 లోపల వేసిన లేఅవుట్‌లలో, కనీసం ఒక్క రిజిస్ట్రేషన్ అయినా జరిగి ఉంటే, వాటిని రెగ్యులరైజ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
  • సాధారణంగా ఓపెన్ స్పేస్ లేకపోతే 14% అపరాధ రుసుము కట్టాల్సి ఉంటుంది. ఈ పథకం కింద 7% అపరాధ రుసుము కడితే సరిపోతుంది.
  • లాండ్ కన్వర్షన్ చార్జీలు, ఇతర డాక్యుమెంట్లు ఉన్నవారు ఆన్‌లైన్‌లో లేదా ఎల్‌టిపి (LTP) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఈ పథకానికి మూడు నెలల సమయం ఇచ్చారు. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
  • 45 రోజుల లోపు పూర్తి రుసుము చెల్లిస్తే 10% రాయితీ, 46 నుంచి 90 రోజుల లోపు చెల్లిస్తే 5% రాయితీ ఇస్తారు.

You cannot copy content of this page

Scroll to Top