స్కూల్ పిల్లలచే మట్టి విగ్రహాలు తయారీ

TEJA NEWS

స్కూల్ పిల్లలచే మట్టి విగ్రహాలు తయారీ

తిరుపతి: తిరుపతిలోని వివిధ స్కూళ్లకు చెందిన పిల్లలు మట్టి గణపతి విగ్రహాలను తయారీ చేసేందుకు పోటీపడ్డారు. వారికి వినాయక మహోత్సవ కమిటీ కన్వీనర్ సామంచి శ్రీనివాస్, సభ్యులు పి.నవీన్ కుమార్ రెడ్డి, గుండాల గోపినాథ్ రెడ్డిలు మట్టి విగ్రహాలు తయారీకి సహకరించారు. ఈ సందర్బంగా కమిటీ సభ్యుడు నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిఒక్కరూ మట్టి గణపతినే పూజిద్దాం… పర్యావరణాన్ని కాపాడుకుందాం… అని సూచించారు. మట్టి గణపతే మహా గణపతి అని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అన్నారు. విగ్రహాల తయారీలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ప్రైవేట్ స్కూల్స్ చిన్నారులు పోటీపడి చిట్టి చేతులతో మట్టి గణపయ్యలను తయారు చేసేందుకు “క్యూ” కట్టారు. విద్యార్థినీ విద్యార్థులకు కమిటీ తరపున విగ్రహ తయారీ సామాగ్రిని అందజేసారు.
గణపయ్యలను అపు రూపంగా, అందంగా తమ స్వహస్తాలతో తయారుచేసిన చిన్నారులకు, వారిని ప్రోత్సహించిన తల్లి తండ్రులకు, స్కూల్ యాజమాన్యానికి అభినందనలు తెలియజేసి ప్రశంస పత్రాలు, పూల మొక్కలను కమిషనర్ మౌర్య చేతుల మీదుగా బహూకరించారు.

You cannot copy content of this page

Scroll to Top