గ్రామీణ ప్రజల హృదయాలను గెలుచుకున్న : సీఎం రేవంత్ రెడ్డి

TEJA NEWS

గ్రామీణ ప్రజల హృదయాలను గెలుచుకున్న : సీఎం రేవంత్ రెడ్డి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
దామరచర్ల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక గిరిజన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పై చూపిన ఆప్యాయత గ్రామీణ ప్రజల మనసులను గెలుచుకుంది. అన్ని వర్గాలతో సమానంగా మా గిరిజనులపై సమాన దృష్టి గౌరవం ప్రేమను చూపిస్తూ రాష్ట్ర ప్రగతిని ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి కి అశ్వారావుపేట గిరిజన సమాజంతో పాటు అన్ని వర్గాల ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. గిరిజనులను కూడా సమానంగా చూసే మీ మంచితనం మాకు ధైర్యంగా నిలిచి మాలో ఆత్మవిశ్వాసం మరింత పెంపొందింది. అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధికి నిబద్ధతతో పని చేస్తున్న మా ఎమ్మెల్యే జారే ఆదినారాయణకి మీరెప్పుడూ అండగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాము. అని గిరిజన నాయకులు, మహిళాలు, కార్యకర్తలు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి పై తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు.

You cannot copy content of this page

Scroll to Top