BRIG మున్సిపల్ హై స్కూల్, చిలకలూరిపేటలో ఘనంగా జరిగిన ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవ వేడుక

TEJA NEWS

BRIG మున్సిపల్ హై స్కూల్, చిలకలూరిపేటలో ఘనంగా జరిగిన ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవ వేడుక…

స్థానిక పండరీపురం లోని భారతరత్న ఇందిరాగాంధీ మున్సిపల్ హై స్కూల్ నందు ఉపాధ్యాయ దినోత్సవ ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది అందరూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల పదవ తరగతి విద్యార్థుల నాయకత్వంలో నిర్వహించబడిన సభ వందేమాతరం తో ప్రారంభమైంది. ఈ సభకు అధ్యక్షులుగా వ్యవహరించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గేరా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి అన్ని వృత్తులలో పవిత్రమైనదని, ఉపాధ్యాయుల మరియు విద్యార్థుల మధ్య అనుబంధం, తల్లిదండ్రులు బిడ్డల పట్ల చూపించే ప్రేమ వలే పరస్పరం నిర్మలమైనదని , విద్యార్థులు క్రమశిక్షణతో ఎదిగి ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఎల్లప్పుడూ కోరుకునే వ్యక్తే ఉపాధ్యాయుడని ఉపాధ్యాయుని గొప్పతనాన్ని వివరించారు. విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఉపాధ్యాయుడు/ ఉపాధ్యాయురాలు విద్యార్థులందరూ గురువులను మించిన గొప్ప స్థానాలను అధిరోహించి తల్లిదండ్రులకు, పాఠశాలకు గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఈ సభలో సీనియర్ ఉపాధ్యాయులైన కొండపర్ల మేరీగ్రేస్, మర్రి స్వరూప రాణి మరియు షేక్ మహమ్మద్ అలీ లను ఘనంగా సత్కరించారు. చివరికి జనగణమన ప్రార్థనా గీతంతో సభ విజయవంతంగా ముగిసింది.

You cannot copy content of this page

Scroll to Top