జాతీయ మహిళా సదస్సు ఏర్పాట్ల పరిశీలన

TEJA NEWS

జాతీయ మహిళా సదస్సు ఏర్పాట్ల పరిశీలన

తిరుపతి: తిరుపతిలో ఈ నెల 14, 15 తేదీలలో
జరగనున్న జాతీయ మహిళా సాధికారిత సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లను బుధవారం ఉదయం నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య అధికారులతో కలసి పరిశీలించారు. సదస్సు జరగనున్న రాహుల్ కన్వెన్షన్ సెంటర్ తో పాటు అతిథులు బస చేయనున్న హోటల్ గదులను పరిశీలించారు. అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండేలా చూడాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఎవరికి కేటాయించిన విధులు వారు చక్కగా సమన్వయంతో నిర్వహించాలని అన్నారు. వచ్చిన అతిథులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా చూసుకోవాలని కోరారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య, స్మార్ట్ సిటీ జి.ఎం. చంద్రమౌళి, తుడా ఈ.ఈ. రవీంద్ర, మునిసిపల్ ఇంజినీర్ లు తులసి కుమార్, గోమతి, తేజస్విని, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్లు సేతు మాధవ్, రవి, ఏసిపి మూర్తి, మధు, డి.ఈలు రమణ, మహేష్, మధు, శిల్ప , వెంకట ప్రసాద్, లలిత, రాజు, మేనేజర్ హాసీమ్, శానిటరీ సూపర్ వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు ఉన్నారు.

You cannot copy content of this page

Scroll to Top