రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

TEJA NEWS

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

సూర్యపేట జిల్లా : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
పోలీసులు తెలిపిన వివరన – పెన్పహాడ్ మండలం పొట్లపహాడ్ గ్రామానికి చెందిన ఇరుగు రవీందర్(59) బుధవారం తన ద్విచక్రవాహనం పై సూర్యాపేట నుంచి పెన్పహాడ్ వైపు వెళ్తుండగా సూర్యాపేట పట్టణం లోని శాంతినగర్ సమీపంలో ముందుగా వెళ్తున్న ఆటో డ్రైవర్ ఒక్కసారిగా ఆపడంతో వెనుక నుంచి బైక్ తో ఢీకొట్టాడు. ఈ ప్రమాదం లో రవీందర్ తలకు బలమైన గాయమైంది. అతడిని సూర్యాపేటలోని ఒ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ సీఐ వెంకటయ్య తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top