చిలకలూరిపేటలోని బొప్పూడి వద్ద శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి గుడి జంక్షన్ దగ్గరరోడ్డు ప్రమాదం

TEJA NEWS

చిలకలూరిపేటలోని బొప్పూడి వద్ద శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి గుడి జంక్షన్ దగ్గర
రోడ్డు ప్రమాదం

ఉదయం TN31 CK0777 నంబర్ గల టూరిస్ట్ బస్సు చెన్నై నుండి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు, గుడి జంక్షన్ వద్ద నిలిపి ఉన్న AP 07TU 2345 నంబర్ గల లారీని వెనుక నుండి ఢీకొట్టింది. ఆ సమయంలో, ఒక మోటార్‌సైకిల్ రాంగ్ రూట్‌లో వస్తుండగా, దానిని తప్పించబోయే క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది.

బాధితులు, గాయాలు
దేవగిరి సుబ్బారెడ్డి (35): ఇతను ధనలక్ష్మి కంపెనీలో కూలీ. యద్దనపూడి మండలం, పూనూరు గ్రామం, బాపట్ల జిల్లాకు చెందినవాడు. ప్రమాదంలో ఇతని తలకు, ఎడమ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉండటంతో ఇతన్ని గుంటూరుకు రిఫర్ చేసే అవకాశం ఉంది.

నల్లమాల సునీల్ (20) ఇతను గిరిజవోలు గ్రామానికి చెందినవాడు. బస్సులో ఇంజిన్ దగ్గర నిలబడి ఉండగా ప్రమాదం జరగడంతో ఇతని ఎడమ కాలు విరిగింది, అలాగే ఎడమ కంటికి స్వల్ప గాయమైంది.
ప్రమాదానికి గురైన వారిని హైవే పోలీసులు, 108 సిబ్బంది శోభన్ బాబు, పవన్ కళ్యాణ్ మొదట ప్రాథమిక చికిత్స అందించి, ఆ తర్వాత అంబులెన్స్‌లో చిలకలూరిపేటలోని RK హాస్పిటల్కు తరలించారు. ఈ సంఘటనపై మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

You cannot copy content of this page

Scroll to Top