కాలగమనం కవితా సంపుటిని పాఠశాలలకు బహుకరించిన కవి డాక్టర్ కంటే నిరంజనయ్య..

TEJA NEWS

కాలగమనం కవితా సంపుటిని పాఠశాలలకు బహుకరించిన కవి డాక్టర్ కంటే నిరంజనయ్య……..
వనపర్తి జిల్లాపానగల్ మండలంలోని
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేతేపల్లి ప్రధానోపాధ్యాయులు బత్తుల శ్రీనివాసులు మరియు పానగల్ మండల విద్యాశాఖ అధికారి ఉద్యోగ విరమణ సందర్భంగా కేతేపల్లిలో పనిచేసి ప్రస్తుతము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు వనపర్తి నందు పనిచేస్తున్న డాక్టర్ కంటే నిరంజనయ్య తెలుగులో తాను స్వయంగా రచించిన “కాల గమనం” కవితా సంపుటిని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేతేపల్లి గ్రంథాలయానికి, మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పానగల్ విద్యార్థుల కొరకు గ్రంథాలయానికి బహుకరించడం జరిగినది. ఈ సందర్భంగా రచయిత కవి నిరంజనయ్య మాట్లాడుతూ ఈ కవితా సంపుటిలో విద్యార్థులకు సమాజానికి సంబంధించిన ఎన్నో మంచి విషయాలు ఉన్నాయని వాటిని విద్యార్థులకు నేర్పించవలసినదిగా ఉపాధ్యాయులను కోరడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆకుల శివాజీ , ఉపాధ్యాయులు శ్రీనివాస రెడ్డి, రవి ప్రసాద్ గౌడ్, బి వెంకటయ్య, యుగంధర్,రాజశేఖర్, నరేష్, నరసింహ, గోపాలకృష్ణ గురురాజు యాదవ్, నాగజ్యోతి, శిరీష పిడి కుమార్ , రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top