అనారోగ్యంతో మరణించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడి అంతిమయాత్రలో పాల్గొన్న : ఎమ్మెల్యే జారే

TEJA NEWS

అనారోగ్యంతో మరణించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడి అంతిమయాత్రలో పాల్గొన్న : ఎమ్మెల్యే జారే

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బజ్జూరు వెంకటనారాయణ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన పార్థివ దేహానికి అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఆయన అంతిమయాత్రలో పాల్గొని పాడే మోశారు. తమ హోదాను పక్కనపెట్టి ఎమ్మెల్యే జారే పార్టీ నాయకుడి పాడే మోయడం చూసిన గ్రామస్తులు ఎమ్మెల్యే మీద తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ అంతిమయాత్రలో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top