నరసరావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ “డిజిటల్ బుక్” ఆవిష్కరణ

TEJA NEWS

నరసరావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ “డిజిటల్ బుక్” ఆవిష్కరణ

నరసరావుపేట: పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ తరఫున “డిజిటల్ బుక్” ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి విడదల రజిని పాల్గొని మాట్లాడుతూ, వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఎదుర్కొంటున్న అన్యాయాలు, వేధింపులు, కక్షలు, తప్పుడు కేసులకు సమాధానం చెప్పే పత్రికా ఆధారం ఈ డిజిటల్ బుక్ అని తెలిపారు.
“కూటమి ప్రభుత్వం పాలనలో మన కార్యకర్తలు ఎదుర్కొంటున్న అన్యాయాలకు సాక్ష్యం, సమాధానం ఇదే. మన నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కార్యకర్తలకు భరోసా, అభయం ఇచ్చే దిశగా ఈ డిజిటల్ బుక్ ప్రారంభించారు” అని రజిని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, సత్తెనపల్లి ఇంచార్జ్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి సహా పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top