సూర్యాపేటలో సద్దుల బతుకమ్మ వేడుకలు

TEJA NEWS

సూర్యాపేటలో సద్దుల బతుకమ్మ వేడుకలు

సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా సూర్యాపేటలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. చైర్మన్ సతీమణి పటేల్ లావణ్య రెడ్డి పట్టణ మహిళలతో కలిసి బతుకమ్మలను పేర్చి, గౌరమ్మ తల్లికి పూజలు చేసి, సంప్రదాయ పల్లె పాటలతో సద్దుల బతుకమ్మను ఆరాధించారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలతో ఆ ప్రాంగణం ఆహ్లాదకరంగా మారింది. ఈ సందర్భంగా మహిళలు ఉత్సాహంగా పాల్గొని సాంప్రదాయ గేయాలు పాడుతూ ఆనందోత్సాహాలతో సంబరాలు జరిపారు. ఈ వేడుకలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పటేల్ రమేష్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ సాంప్రదాయ పండుగ బతుకమ్మను ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

You cannot copy content of this page

Scroll to Top