అసంపూర్తి బ్రిడ్జి.. ప్రమాదాలకు నిలయం

TEJA NEWS

అసంపూర్తి బ్రిడ్జి.. ప్రమాదాలకు నిలయం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ములకలపల్లి నుండి రింగిరెడ్డిపల్లి మధ్య బ్రిడ్జి నిర్మించి అసంపూర్తిగా వదిలేసిన బ్రిడ్జి కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్రిడ్జికి ఇరువైపులా సేఫ్టీ లేకపోవడంతో రాత్రిపూట ప్రమాదాలు జరుగుతున్నాయి అని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో బీజేపీ, జనసేన నాయకులు స్పందించి బ్రిడ్జికి ఇరువైపులా డేంజర్ రిబ్బన్లను ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆరు గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు.

You cannot copy content of this page

Scroll to Top