పల్లె పండగ విజయం తాలూకు స్ఫూర్తిని కొనసాగించేలా పల్లె పండగ

TEJA NEWS

పల్లె పండగ విజయం తాలూకు స్ఫూర్తిని కొనసాగించేలా పల్లె పండగ 2.0 ప్రణాళికలు ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ముఖచిత్రం సంపూర్ణంగా మారేలా ఈ ప్రణాళికలు ఉండాలని తెలిపారు. క్యాంపు కార్యాలయంలో పల్లె పండగ 2.0పై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ శ్రీ కృష్ణతేజ, ఒ.ఎస్.డి. వెంకటకృష్ణ , ఇంజనీరింగ్ చీఫ్ పంచాయతీరాజ్ శ్రీ బాలు నాయక్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top