నంది అభిషేక మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి – భక్తులకు ముఖ్య సూచనలు

TEJA NEWS

నంది అభిషేక మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి – భక్తులకు ముఖ్య సూచనలు

సూర్యపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట పట్టణానికి అతి సమీపంలో ఉన్న పిల్లలమర్రి గ్రామంలోని ప్రసిద్ధ శివాలయాల్లో అక్టోబర్ 18వ తేదీ శనివారం సాయంత్రం జరగనున్న నంది అభిషేక మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ కమిటీ అధ్వర్యంలో శుభ్రపరిచే పనులు, అలంకరణా కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొనేలా ఆలయ అధికారులు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. సాయంత్రం 5 గంటలకల్లా భక్తులు దేవాలయానికి చేరుకోవాల్సిందిగా కమిటీ విజ్ఞప్తి చేసింది. 7 గంటల లోపు అభిషేకం కార్యక్రమం పూర్తవుతుంది. ఆ తరువాత దేవాలయ ఆవరణలో దేవుని మహా అలంకరణ మాత్రమే జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.భక్తుల కోసం ప్రత్యేక రవాణా సౌకర్యంవాహన సౌకర్యం లేని భక్తుల కోసం విద్యా భారతి హై స్కూల్ – నంద్యాల నరేందర్ రెడ్డి సహకారంతో ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. శంకర్ విలాస్ సెంటర్‌లోని యువత షూ ప్యాలస్ షాప్ వద్ద సాయంత్రం 5:15 నిమిషాలకు బస్సు బయలుదేరుతుందని, భక్తులు ముందుగానే అక్కడికి చేరుకోవాలని నిర్వాహకులు సూచించారు. అభిషేక కార్యక్రమం పూర్తయ్యాక అదే బస్సులో భక్తులను సూర్యాపేటకు తిరిగి చేర్చే ఏర్పాట్లు చేశారు.భక్తులు సాంప్రదాయ దుస్తులతో రావలసిందిగా ఆలయ కమిటీ ప్రార్థించింది. కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఆలయ కమిటీ చైర్మన్ గవ్వ వెంకట కృష్ణారెడ్డి (ఫోన్: 91825 81579) ను సంప్రదించవచ్చని తెలిపారు.భక్తులు సమయపాలన పాటిస్తూ ఆధ్యాత్మిక వాతావరణంలో పాల్గొంటూ నందీశ్వరుని అనుగ్రహం పొందాలని ఆలయ నిర్వాహకులు ఆకాంక్షించారు.

You cannot copy content of this page

Scroll to Top