ముఖ్యమంత్రి సహాయనిధి దరఖాస్తులు సచివాలయంలో సమర్పించిన : ఎమ్మెల్యే జారే

TEJA NEWS

ముఖ్యమంత్రి సహాయనిధి దరఖాస్తులు సచివాలయంలో సమర్పించిన : ఎమ్మెల్యే జారే

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న పేదకుటుంబాలకు ఆర్ధిక చేయూత కోసం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రత్యేక చొరవ కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలో హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయం (సెక్రటేరియట్) లో ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) కోసం స్వీకరించిన 120 దరఖాస్తులను నేడు సంబంధిత అధికారులకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి కుటుంబం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఉపశమనాన్ని పొందేలా నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
అదేవిధంగా వైద్య చికిత్స అవసరమున్న ప్రతి అర్హత కలిగిన కుటుంబం తమ వివరాలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి అందజేయాలని వారికి ప్రభుత్వ నుంచి ఉచితంగా వైద్య సహాయం అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సచివాలయం అధికారులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top