కువైట్ కళాసమితిలో “తుడ” చైర్మన్ కు స్వాగతం…

TEJA NEWS

కువైట్ కళాసమితిలో “తుడ” చైర్మన్ కు స్వాగతం

తిరుపతి: కువైట్ పర్యటనకు వెళ్లిన “తుడ” చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అక్కడి కళాసమితిలో ఘన స్వాగతం లభించింది.
తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ కువైట్ లో దిగగానే తెలుగు సభ్యులు, తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం చెప్పారు.
కువైట్ లో తెలుగు కళాసమితి మెగా ఈవెంట్ కు ముఖ్య అతిథిగా రెండు రోజుల పర్యటన నిమిత్తం తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి కువైట్ కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.
ఈ సందర్భంగా తెలుగు కళాసమితి కువైట్ సభ్యులను, తెలుగుదేశం, జనసేన నాయకులను తుడా చైర్మన్ ఆప్యాయంగా పలకరించారు. కాగా
తుడా చైర్మన్ కువైట్ లో రెండు రోజులు పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు.

You cannot copy content of this page

Scroll to Top