ఎడ్లపాడు గ్రామంలో జిల్లా వ్యవసాయ అధికారి పర్యటన..

TEJA NEWS

ఎడ్లపాడు గ్రామంలో జిల్లా వ్యవసాయ అధికారి పర్యటన..

ఎడ్లపాడుమండలం, ఎడ్లపాడు గ్రామంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎం. జగ్గారావు మంగళవారం పర్యటించారు.ఈ సందర్భంగా స్థానిక రైతులతో సమావేశమై, మొంథా తుఫాన్ ప్రభావం,వర్షాల పరిస్థితులు,రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు,వారు తీసుకుంటున్న జాగ్రత్తలపై వివరాలు సేకరించారు.మొంథా తుఫాన్ ప్రభావిత మండలాల్లో, గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పల్నాడు జిల్లాలో సాగు చేస్తున్న పత్తి మరియు ఇతర వాణిజ్య పంటలకు నీరు మునిగే పరిస్థితులు తలెత్తాయని ఆయన పేర్కొన్నారు.పొలాల్లో నీరు ఎక్కువగా నిల్వ ఉండకుండా తక్షణమే తొలగించాలని, పంట ఎదుగుదలకు ఉపయోగపడే బూస్టర్ ఎరువులు వేయాలని రైతులకు సూచించారు.అలాగే తెగుళ్లు, పురుగుల నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని వివరించారు.జగ్గారావు మాట్లాడుతూ ప్రతి మండల వ్యవసాయ అధికారి,సహాయకులు తమ హెడ్‌క్వార్టర్‌లలో రైతులకు అందుబాటులో ఉండాలని,మొంథా తుఫాన్ ఔట్రిచ్ కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు.మండల వ్యవసాయ అధికారి హరి ప్రసాద్ మాట్లాడుతూ పంట నష్టాలు సంభవించిన వెంటనే రైతులు సంబంధిత వ్యవసాయ సహాయకులను సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ జీవన్, వ్యవసాయ సహాయకులు అనుపమ,బిలాల్, గ్రామ పెద్దలు, నాయకులు,రైతులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top