తుపాను ప్రభావంతో రైతులు నష్టపోకుండా చూడాలి

TEJA NEWS

తుపాను ప్రభావంతో రైతులు నష్టపోకుండా చూడాలి

కలెక్టర్ బి.యం. సంతోష్

తుపాను ప్రభావం వల్ల రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో రైతులకు నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బి.యం. సంతోష్ అధికారులను ఆదేశించారు. రైతులు ధాన్యం నిల్వలతో పాటు ఆయా ప్రాంతాల్లో ఆరబెట్టిన పంట ధాన్యం వర్షానికి తడిసి నష్టపోకుండా రైతులకు టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని అన్నారు. తుపాను ప్రభావం గురించి రైతులకు తెలియజేస్తూ, అప్రమత్తం చేయాలని కలెక్టర్ సూచించారు. రానున్న మూడు రోజుల పాటు అవసరమైతే వరి కోతలు జరపకుండా రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు.

జారీ చేయువారు డిపిఆర్ఓ/ జోగులాంబ గద్వాల జిల్లా.

You cannot copy content of this page

Scroll to Top