పారిశుధ్థ్యంపై ఎన్.సి.సి. అధికారులచే అవగాహన

TEJA NEWS

పారిశుధ్థ్యంపై ఎన్.సి.సి. అధికారులచే అవగాహన

తిరుపతి: నగరంలో పారిశుధ్థ్యం మరింత మెరుగ్గా చేపట్టేందుకు ప్రజల్లో అవగాహన కల్పించే ప్రక్రియలో భాగంగా ఎన్.సి.సి. అధికారులు ముందుకొచ్చారు. ఈ మేరకు మంగళవారం ఎన్.సి.సి. అధికారులు నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్యను కలిశారు. సామాజిక సేవ, సమాజ అభివృద్ధికి ఎన్.సి.సి. అందిస్తున్న సేవలను వివరించారు. తమ క్యాడేట్ల ద్వారా పారిశుధ్థ్యం, పర్యావరణ పరిరక్షణ, విపత్తుల నిర్వహణపై శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. సామాజిక సేవ కార్యక్రమాల్లో భాగంగా నగరంలో ప్రజలకు పారిశుధ్థ్యం, ఇంటింటి నుండి తడి, పొడి చెత్త సేకరణ… అందువలన కలిగే ప్రయోజనాలు తదితర వాటిపై నగరంలోని ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఏవైనా విపత్తులు సంభవించినా తమ ఎన్.సి.సి. క్యాడేట్లు సాయం ఆందిస్తారని పేర్కొన్నారు. ఎన్.సి.సి. తిరుపతి శాఖ నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలను కమిషనర్ ప్రశంసించారు. నగరంలో పారిశుధ్థ్యం పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పూర్తి సహకారం అందిస్తామని కమిషనర్ మౌర్య తెలిపారు. డిప్యూటీ కమిషనర్ అమరయ్యతో పాటు ఎన్.సి.సి. తిరుపతి శాఖ అధికారులు ఉన్నారు.

You cannot copy content of this page

Scroll to Top