షేక్ పేట్ డివిజన్ లోని బిజెఆర్ నగర్ ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మరియు కెకెఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ *
సాక్షిత : జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని షేక్ పేట్ డివిజన్ బిజెఆర్ నగర్ లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ , కెకెఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ * మరియు ఎమ్మెల్సీ శ్రీమతి విజయశాంతి , తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి కల్వ సుజాత , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నేమూరి రాములు గౌడ్ తో కలిసి కార్నర్ మీటింగ్ లో పాల్గొనడం జరిగింది..
అనంతరం కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ..
జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి. నవీన్ యాదవ్ ని భారీ మెజారిటీతో గెలుపించాలని కోరారు..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయత్వంలో ప్రజాపాలన ద్వారా ప్రజలకు సంక్షేమా ఫలాలు సంపూర్ణంగా అందుతున్నాయని కొనియాడారు..
ఇన్నిరోజుల నుండి అభివృద్ధికి నోచుకోలేని జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి ఈ ప్రజాపాలనతోనే సాధ్యమవుతుందన్నారు..
ఈ కార్యక్రమం జూబ్లీహిల్స్ నియోజకవర్గం పార్టీ నాయకులు, ఇంచార్జ్ లు, మహిళ నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో పాటు తదితరులు పాల్గొన్నారు..
