ప్రతి నెల 100 కు పైగా మొబైల్ ఫోన్స్ రికవరీ చేస్తున్న జిల్లా పోలీస్
సి.ఈ.ఐ.ఆర్ ద్వారా ఇప్పటివరకు 2340 మొబైల్ ఫోన్స్ రికవరీ
- బాధితులకు రూ.20 లక్షల విలువైన 102 మొబైల్ ఫోన్లను అందించాము.
- మొబైల్ కేంద్రంగానే సైబర్ మోసాలు
- ధాన్యం డబ్బులు వేస్తాం వివరాలు చెప్పండి అంటూ సైబర్ మోసగాళ్ళు రైతులను మోసం చేసే అవకాశం ఉన్నది.
- రైతులు అప్రమత్తంగా ఉండాలి.
నరసింహ ఐపీఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా.
….
సూర్యపేట జిల్లా ప్రతినిధి: జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి జిల్లాలో ప్రజలు వివిధ రూపాల్లో పోగొట్టుకున్న 102 ఫోన్ల ను గుర్తించి రికవరీ చేసి జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ చేతుల మీదుగా సంబంధిత మొబైల్ ఫోన్ల యజమానులకు (భాదితులకు) అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…. ఈ సంవత్సరం 7వ దఫా మొబైల్ మేళా నిర్వహించి రికవరీ చేసిన మొబైల్స్ ను బాధితులకు అందించాము. ఈ పోర్టల్ ద్వారా ఇప్పటివరకు 2340 మొబైల్ లను రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగినది. ఈరోజు రూ.20 లక్షల విలువైన 102 మొబైల్స్ బాధితులకు అందించాము. దీనికోసం జిల్లా పోలీసు చాలా కృషి చేసినది, పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న సైబర్ వారియర్స్ నిరంతర శ్రమ ఫలితంగానే ఈ 102 మొబైల్ ఈరోజు బాధితులు అందించగలిగాము అన్నారు. వీటిని వివిధ రాష్ట్రాల నుంచి తెప్పించాము అని తెలిపారు. మన యొక్క విలువైన సమాచారం బ్యాంక్ అకౌంట్స్, పాస్ వర్డ్స్, సోషల్ మీడియా అకౌంట్స్, వ్యక్తిగత ఫోటోలు మొదలైన వంటివి ఫోన్ లో నిక్షిప్తం చేసుకుంటున్నాము అన్నారు, మొబైల్ చోరికి గురైనా, పోగొట్టుకున్నా అందులో ఉన్న సమాచారం పోతుంది. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు కేవలం మొబైల్ ఫోన్ మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత సమాచారంతో సహ డబ్బులను కూడా కోల్పోవడం జరుగుతున్నారు. సైబర్ మోసానికి గురై ఆర్థికంగా నష్టపోతున్నారు. పోయిన మొబైల్స్ ను గుర్తించడానికి CEIR పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, ఈపోర్టల్ ద్వారా మంచి ఫలితాలు రాబట్టడం జరిగినది ఎస్పీ వివరించారు. ఎవరైన మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే CEIR పోర్టల్ ( https://www.ceir.gov.in ) నందు నమోదు చేసుకోవాలి, మొబైల్ ను బ్లాక్ చేసి, మీ సేవా ద్వారా ధరఖాస్తు సంభందిత పోలీసు స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలు, వినియోగదారులు ఎవరైనా సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ లను కొనుగోలు చేసినట్లైతే అట్టి షాప్ యజమాని నుండి రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.
పోలీసు సేవలను గుర్తించాలి
పోలీసులు ప్రజల రక్షణలో, ఆస్తుల రక్షణలో అనుక్షణం ప్రజల పక్షాన పని చేస్తుంది, మన కోసం పోలీసు ఉన్నారని భావన కలిగి పోలీసు కృషిని గుర్తించాలి అని అన్నారు, పోలీసు శాఖ కృత నిచ్చయంతో పని చేసి ప్రజలకు పోలీసు సేవలు అందిస్తున్నారు అన్నారు.
రైతులు అప్రమత్తంగా ఉండాలి.
ప్రస్తుత సమాజంలో మనం చాలా సందర్భాలలో సైబర్ మోసగాళ్ళు కొత్త ఎత్తులతో ప్రజలను మోసం చేస్తున్న సందర్భాలు చూస్తున్నాము, పంటకాలం చేతికొచ్చే సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని పంట డబ్బులు అకౌంట్లో వేస్తాము అంటూ అపరిచితులు ఎవరైనా ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు బ్యాంకు వివరాలు ఓటీపీ వివరాలు అడిగితే ఇవ్వవద్దని తెలిపారు వారికి తెలిపి ఆర్థికంగా నష్టపోవద్దన్నారు. ప్రజలు అత్యాసకు పోయి సైబర్ మోసాల బారిన పడోద్దు తక్కువ వడ్డీకి లోన్స్ ఉన్నాయి, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు, బహుమతులు వచ్చాయి అంటే నమ్మి అపరిచితులకు డబ్బులు పంపవద్దు, వ్యక్తిగత వివరాలు చెప్పవద్దు అన్నారు.
ధాన్యం రోడ్లపై ఆరబోయవద్దు.
పండిన ధాన్యాన్ని రోడ్లపై అరబోయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది కావున రైతులు ప్రజలు ధాన్యాన్ని రోడ్లపై అరబోయవద్దని ఎస్పి గారు తెలిపినారు. ప్రయాణ సమయంలో ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని, హెల్మెట్ తప్పక ధరించాలని, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని నిబంధనలు పాటించాలని సూచించారు.
పోలీసు శాఖకు ధన్యవాదాలు తెలిపిన మొబైల్స్ పొందిన బాధితులు..
పోయిన మొబైల్ ఫోన్లు మళ్లీ దొరకదనుకున్న బాధితులు జిల్లా పోలీసులు టెక్నాలజీ ఉపయోగించి ఫోన్ రికవరీ చేసి అందించినందుకు సంభందిత బాధితులు జిల్లా ఎస్పీ కి, పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో వివిధ రూపాల్లో వినియోగదారులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్స్ ను CEIR అప్లికేషన్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అప్పగించడంలో కృషి చేస్తున్న ఐ.టి కోర్ సిబ్బందిని, పోలీస్ స్టేషన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు అభినందించారు. ఈ కార్యక్రమం నందు అదనపు ఎస్పి రవీందర్ రెడ్డి, DCRB డిఎస్పీ రవి, స్పెషల్స్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, IT కోర్ RSI రాజశేఖర్, సిబ్బంది ఉన్నారు.
