ఎడ్లపాడులో 25% రాయితీపై శనగ విత్తనాల పంపిణీ ప్రారంభం.

TEJA NEWS

ఎడ్లపాడులో 25% రాయితీపై శనగ విత్తనాల పంపిణీ ప్రారంభం..

ఎడ్లపాడు: రైతులకు శనగ విత్తనాలను 25 శాతంరాయితీతో అందిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి ఏ. హరిప్రసాద్ తెలిపారు.సెనగ జి.జి. 11 రకం విత్తనాల పూర్తి ధర కిలోకు 78 రూపాయలు కాగా, 19.50 రూపాయలు సబ్సిడీగా మంజూరు చేసి, రైతు వాటా 58.50రూపాయలుగా నిర్ణయించినట్లు ఆయనవివరించారు. ప్రస్తుతం మొత్తం 95 క్వింటాళ్ల సెనగ విత్తనాలు ఎడ్లపాడు, జాలాది, తుర్లపాడు, సొలస మరియు లింగారావుపాలెం గ్రామాల రైతుసేవా కేంద్రాలలో లభ్యమవుతున్నాయని హరిప్రసాద్ తెలిపారు. రైతుల అవసరాల మేరకు అదనంగా కూడా విత్తన నిల్వను ఏర్పాటు చేసే చర్యలు తీసుకుంటున్నామన్నారు.

You cannot copy content of this page

Scroll to Top