కోవూరు ఎస్‌ఐగా కే. ముత్యాలరావు బాధ్యతలు స్వీకారం

TEJA NEWS

కోవూరు ఎస్‌ఐగా కే. ముత్యాలరావు బాధ్యతలు స్వీకారం

ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటా

కోవూరు పోలీసు స్టేషన్ కొత్త సబ్‌ఇన్స్‌పెక్టర్‌గా కే. ముత్యాలరావు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సాధారణ సమావేశంలో సిబ్బందితో సమావేశమై ప్రాధాన్య అంశాలను వివరించారు. ప్రజల సమస్యలకు త్వరితగతిన స్పందించడం, శాంతి భద్రతల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదని ఆయన స్పష్టం చేశారు.స్థానిక ప్రజలతో సమన్వయం పెంచి, కోవూరు పట్టణంలో నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌.ఐ. ముత్యాలరావు తెలిపారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో స్టేషన్ పరిధి పరిస్థితులను అధ్యయనం చేసి, అవసరమైన పోలీసింగ్ చర్యలను అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.

You cannot copy content of this page

Scroll to Top