శివాలయంలో 2000 మందికి పైగా మహా ప్రసాదం
హర హర మహాదేవ శంభో శంకర అన్న భక్తజనం
కోవూరు కార్తీక మాసం 4వ సోమవారం ప్రధాన అర్చకులు విశ్వనాథం సుబ్బరామయ్య పర్యవేక్షణలో, కామాక్షి మల్లికార్జున దేవస్థానంలో శివయ్యకు భక్తిశ్రద్ధలతో పూజలు ఘనంగా చేసి, అనంతరం దేవస్థానం శివయ్య భక్త బృందం ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాదం నిర్వహించారు.. దాదాపు “2000 వేల మందికి” పైగా భక్తులందరూ దీంట్లో భాగస్వాములు అయ్యారు.. అనంతరం వారు మాట్లాడుతూ .. ఈ కార్తీకమాసం వేకువ జాము నుంచి ఆ కైలాస్ ని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు రావడం అలాగే ఈ దేవస్థానానికి ఒక ప్రత్యేకత ఉంది దాదాపు 100 సంవత్సరాల పైన చరిత్ర ఉన్న ఈ దేవస్థానం ఆ శివయ్యకి ఈ కార్తీకమాసం లో ఏమి కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తాడని నమ్మకంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తారు.. ఆ శివయ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని తెలియజేశారు .ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు విశ్వనాథం సుబ్బరామయ్య, ఈవో సి.హెచ్. కృష్ణ ప్రసాద్, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, శేఖర్ స్వామి, శివయ్య భక్తి బృందం బండ్ల సురేష్, పాటూరు మోహన్, బండ్ల నాగరాజు, జి. వెంకట శేషగిరి,పి. హరి, తదితరులు ఉన్నారు…
